Tuesday, June 17, 2008

ఎమని చెప్పను నీ గూర్చి

మధుర సుధామృత భరితమైన
నీ స్నెహా వీణావాహినిలో
మధుర గాయకుడ నేనై
రసరమ్య గానాలాపనలతొ
సాగె నీఅడుగుల హంసద్యనినినేనై
ఊహలలొఊయలూగు
నీ ఉహారాజును నేనై
నీ తలపుల తలుపు తెరచి
నీ వలపుల పిలుపుకై వెచి
వయస్సు కనె తీయని నీ కలల సావెరిలో
మనసు చెప్పె కమ్మని నీ కవితల లొగిలిలొ
బ్రతుకు నడుపుకొస్తున్న కమనీయమైన కథకు
కథానాయకున్ని నేనై
నీతో జతగా నే పయనించనా!

ఇంకా ఎమని చెప్పను నీగురించి
గ్రిష్మంలో అగుపించే ఆమనివనా!
ఎడారిలొ ఉద్బవించిన ఒయాసిస్సువనా!
అమిత వెదనలొ ఒదార్పువా!
ఇంకా ఇంకా ....... ఎమని చెప్పను నీ గూర్చి

No comments: