పగలూ రాత్రి పడిలేచే
కడలి కెరటంలా
నీ చుట్టూ తిరిగే
ఆలొచనా తరంగాల్ని ఎలా ఆపగలను
నవకవితా కన్యకలా
వసంత కోకిలలా
నాట్యమయూరిలా
ఉత్సాహంగా నీపై సాగే
నా ఆలోచనలను ఎలా ఆపగలను.
ఒకటి రెండు రోజుల ఎడబాటునే
భరించలేని నేను
గత రోజులుగా జరుగుతున్నగతాన్ని
తలుచుకుంటె గుండఅగేట్టుంది
అందుకేనేమొ అందరికి అగుపిస్తున్నాను
ప్రాణమున్న శవంలా
నీ సాంగత్యం కోసం తనువులోని
అనువనువూ తపిస్తూంది
ఈ కాలాన్ని కట్టుబాట్లుతో కట్టెసి
నీతో కలసి విహరించాలంటుంది ఈతనువు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment