Wednesday, June 18, 2008

భావాలెన్నింటినో

భాష చెప్పని భావాలెన్నింటినో
నీ చూపులలో చదువుకొన్నా
కథలు చెప్పె నీ అధరాలలో
కావ్యాలెన్నింటినో అప్పచెప్పుకొన్నా

చిరుగాలి తెరల మధ్య తేలివచ్చిన చల్లదనంలొ
నీపిలుపుని వెతుకొన్నా
కళ్ళ ఎదుట ఈజాబిల్లి అల్లిబిల్లి కలకాదుసుమా!
నింగిలో నెలవ నెలకొన్నా 'వెన్నల' వెదజల్లడా ఎమి ?
నీటిలో కలువ కొలువున్నా 'పరిమళ' విరిబూయదా మరి!
కావేరి వంటి నీ అనురాగ వెళ్లువలో
సాగరం నెనై నిను కలుపు కొంటా
గోదారి పోంగంటి నీ మనస్సుకి
తీరాన్ని నెనై తొడు వాస్తాను
కాలం తొ నీ పయనం కట్టెసి, అస్తమానం ఈవర్తమానంలొ
చిరస్మరనీయులై చిరంజీవులై ఉండిపోదాం.

No comments: